: కొత్త నోట్లు తెస్తున్నప్పుడు సైజును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?: చేతన భగత్
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని కొంత మంది సెలబ్రిటీలు స్వాగతించినా, మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం తప్పు పడుతున్నారు. ప్రధాని నిర్ణయాన్ని నిన్న సమర్థించిన ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ నేడు విమర్శించారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని గోప్యంగా తీసుకున్నప్పుడు నోటు సైజును ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఏటీఎంలలో చాలా ఏటీఎంలకు ఈ నోట్లు సరిపోవని, అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఏటీఎంలలో మార్పులు చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి ఎంత సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఎలా ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించారని ఆయన నిలదీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కూడా ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.