: బ్యాంక్ అద్దాలు పగలగొట్టిన ముజఫర్ నగర్ వాసులు


పెద్దనోట్లు మార్చుకునేందుకు వచ్చిన ఖాతాదారులు సహనం కోల్పోయి బ్యాంకులో విధ్వంసం సృష్టించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. గంటల తరబడి క్యూలో నిలబడినప్పటికీ నోట్ల మార్పిడి జరగడం లేదంటూ రెచ్చిపోయారు..బ్యాంకు అద్దాలు పగులగొట్టారు. అయినా, శాంతించని ఖాతాదారులు బ్యాంకులో నుంచి బయటకు వచ్చి అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News