: ఇదొక భారీ నల్ల కుంభకోణం: మమతా బెనర్జీ


పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు వ్యవహారం ఇప్పుడొక భారీ నల్ల కుంభకోణంగా మారిందని అన్నారు. మనీ లాండరింగ్ చేసేవారికి లబ్ధి చేకూర్చేలా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే తాను చెప్పానని అన్నారు. సామాన్య ప్రజానీకం మాత్రం చాలా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి హరించిపోయిందని... మార్కెట్లు కుప్పకూలిపోయాయని ఆమె చెప్పారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. అవినీతిపరులకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీలు అండగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News