: విశాఖ-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతి మధ్య త్వరలో ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ నుంచి సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 22 నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు ప్రతి మంగళవారం నాడు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 23 నుంచి డిసెంబరు 28వ తేదీ వరకు ప్రతిబుధవారంనాడు ప్రత్యేకరైళ్లను నడుపుతారు. అదేవిధంగా, విశాఖ-తిరుపతి మార్గంలో ఈ నెల 21 నుంచి డిసెంబరు 26 వరకు ప్రతి సోమవారం నాడు ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి. ఇదే మార్గంలో తిరుగుప్రయాణానికి సంబంధించి తిరుపతి-విశాఖకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 27వరకు ప్రతి మంగళవారం ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.