: ముంబైలోని ఒక్క స్టేట్ బ్యాంక్ బ్యాంకులోనే 60,000 కోట్లు జమ!


500, 1000 రూపాయల నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా నగదు జమ అవుతోంది. అకస్మాత్తుగా కేంద్రం నిర్ణయం ప్రకటించడంతో కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక చాలా మంది బ్యాంకుల ముందు క్యూకట్టారు. దీంతో భారీ ఎత్తున బ్యాంకుల్లో 500, 1000 నోట్లు జమ అవుతున్నాయి. ముంబైలోని ఒక ప్రభుత్వ బ్యాంకులో సుమారు 60,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొలి రోజైన గురువారం 31,000 కోట్ల రూపాయల నగదు జమ కాగా, రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నానికి మరో 22,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. దీంతో రెండు రోజుల్లో సుమారు అరవై వేల కోట్లకుపైగా పెద్ద నోట్లు జమ అయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌ ప‌ర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. అదే సమయంలో ఈ రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల ద్వారా సుమారు 1500 కోట్ల రూపాయల నగదును రద్దైన పెద్ద నోట్ల స్థానంలో మార్పిడి చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో ఒక్క ఎస్బీఐలోనే ఇంత మొత్తం జమ అయితే, మిగిలిన బ్యాంకులన్నీ కలుపుకుంటే ఎంత మొత్తం జమ అయి ఉంటుందని అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News