: ట్రంప్ హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు... తెలుసా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో మరో కోణాన్ని ఇంతవరకు మీడియా ప్రస్తావించలేదు. ట్రంప్ కి సినిమాల్లో నటించాలన్న బలమైన కోరిక ఉండేది. గోల్డ్ స్పూన్ తో పుట్టిన ట్రంప్ వ్యాపార రంగంలో ఉంటూనే తన నటనాభిరుచిని కూడా తీర్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించి, తన కోరికను తీర్చుకున్నారు. అయితే వీటిలో ఎక్కువగా సంపన్న తండ్రి పాత్రలనే ఆయన పోషించడం విశేషం. 'ద ఫ్రెఫ్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఏర్', 'ది జాబ్', 'సడెన్లీ సుశాన్', 'సెక్స్ అండ్ ద సిటీ', 'ద డ్రా కేరీ షో', 'టు వీక్స్ నోటీస్', 'స్పిన్ సిటీ', 'ద నానీ', 'ద అసోసియేట్', 'ద లిటిల్ రాస్కెల్స్', 'జూలాండర్', 'ఎడ్డీ', 'హామ్ ఎలోన్ 2' వంటి మొత్తం 14 టీవీ షోలు, 12 సినిమాల్లో నటించిన ట్రంప్, తొలిసారి 1985లో 'ది జెఫర్ సన్స్' అనే టీవీ షో ద్వారా తన కోరికను తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. 1989లో 'గోస్ట్ కాంట్ డు ఇట్' అనే సినిమాతో హాలీవుడ్ రంగప్రవేశం చేశారు.