: దక్షిణ భారత రుచుల 'ధరణి' రెస్టారెంట్ ఇప్పుడు కనెక్టికట్ లో కూడా!
యూఎస్ఏ, కనెక్టికట్, Nov 11th 2016: బోస్టన్, రాలీ, అల్బానీ నగరాల్లో విశిష్ట ఆదరణ పొందిన తర్వాత దక్షిణ భారత రుచులు అందించే ధరణి రెస్టారెంట్ ఇప్పుడు కనెక్టికట్ లో భోజన ప్రియులను అలరించటానికి ప్రారంభం కానుంది. ప్రముఖమైన మాంచెస్టర్ సి.టి. ప్రాంతంలో నెలకొల్పబడే ఈ రెస్టారెంట్ దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాల వంటలను, కొత్త రుచులను అందిస్తుంది. అమెరికాలో ఎన్నో ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న ఆల్టామౌంట్ రెస్టారెంట్ గ్రూపు వారు దామినేని గ్రూపుతో కలిసి వారి ధరణి రెస్టారెంటుని మాంచెస్టర్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఒకప్పటి అమెరికా నూలు పరిశ్రమకి చిరునామాగా ఉన్న కనెక్టికట్ లోని మాంచెస్టర్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైన వాణిజ్య ప్రాంతం. సరికొత్త ధరణి రెస్టారెంట్ దక్షిణ భారత ప్రసిద్ధ వంటకాలను, రుచులను అందించే క్రమంలో ఆల్టామౌంట్ ప్రాంతంలో విశేషంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ధరణి రెస్టారెంట్లు అల్బానీ, న్యూయార్క్ ప్రాంతంలో భారతీయుల ఆదరణ గడిస్తోంది. హార్ట్ ఫర్డ్ వాణిజ్య ప్రాంతానికి దగ్గరగా ఉండే ఈ రెస్టారెంట్ భారతీయులు వుండే మరిన్ని ప్రాంతాలకు చేరువగా ఉంది. 5000 చదరపు అడుగులతో ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉండేట్టు తీర్చిదిద్దారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ కార్యక్రమాలకి అనువైన సదుపాయాలు, వాతావరణం ఇక్కడ ఉంటాయి. ఈ సందర్భంగా ధరణి మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని శ్రీధర్ తోటకూర మాట్లాడుతూ ఇలా అన్నారు, "మా రెస్టారెంట్ అందించే రుచులు మా వ్యాపార భావనలకు అనుగుణంగా ఉంటాయి. ఈ క్రమంలో మేము మా వినియోగదారులకు ఇంట్లో భోజనం చేసే అనుభూతిని అందిస్తాము. దీనితో పాటు రుచి, వైవిధ్యం మరియు నాణ్యత మా ప్రత్యేకత" ధరణి మాంచెస్టర్ అందించే వంటకాలలో కొన్ని ఆకర్షణీయమైనవి పెసరట్టు కుర్మా, రకరకాల దోశలు, దమ్ బిర్యానీ, చెట్టినాడు రుచులు, ఇండో చైనా వంటకాలు ముఖ్యమైనవి. ధరణి మెగా బఫెట్ లో భాగంగా జిలేబీలు, చాట్, దోస స్టేషన్లు, భారతీయ పేస్ట్రీలు, కేకులు, ఇంకా 50 రకాల ఐటమ్స్ నెలలోని ప్రతి రెండవ ఆదివారం వడ్డిస్తారు. ధరణి న్యూయార్క్ ఫ్రాంచైజ్ యజమాని శ్రీధర్ పెంట్యాల మాట్లాడుతూ, ధరణి కొత్త రెస్టారెంటు ప్రారంభం ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తోంది అన్నారు. "చక్కటి వాతావరణం, నాణ్యత, రుచితో కూడిన వంటకాలతో ఈ కొత్త రెస్టారెంటు ఎంతో ఆదరణ పొందుతుందని మా నమ్మకం" అన్నారు. "అమెరికాలో ధరణి వేగంగా విస్తరించటం ఎంతో ఆనందం కలిగిస్తోంది” అని ప్రభాకర్ దామినేని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆల్టామౌంట్ యజమాని భాస్కర్ రెడ్నాం మాట్లాడుతూ మసాచుసెట్స్, న్యూయార్క్, వర్జీనియా, కనెక్టికట్, నార్త్ కరోలినా మరియు టెక్సాస్ లో కొత్త రెస్టారెంట్లు రాబోతున్నట్టు ప్రకటించారు. "మూడేళ్ల శ్రమతో మా కలల్ని ఈ విస్తరణతో, మీ ఆదరణతో మేము నిజం చేసుకుంటున్నాము" అన్నారు. ఈ వారాంతంలో గ్రాండ్ మెగా బఫెట్ ఆస్వాదించండి ధరణి మాంఛెస్టర్లో: ధరణి మాంచెస్టర్ 1141 టోలాండ్ టర్న్ పైక్, మాంచెస్టర్, సి.టి. 06042 సంప్రదించండి: డి.ప్రభాకర్ (860) 432-1122 INFO@DHARANIUS.COM WWW.DharaniUS.COM Press note released by: Indian Clicks, LLC