: బయ్యారంలో ఉక్కుదిమ్మెల పరిశ్రమ: కేంద్ర ఉక్కుమంత్రి
తెలంగాణ అంశం, బయ్యారం గనులను విశాఖ స్టీల్ కు కేటాయించినందున అక్కడే పరిశ్రమ పెట్టాలంటూ పార్లమెంట్ ఆవరణలో దీక్ష చేస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల దీక్షకు ఫలితం దక్కింది. బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ నెలకొల్పుతామని సాక్షాత్తూ కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బేణీ ప్రసాద్ వర్మ దీక్ష చేస్తున్న ఎంపీలకు హామీ ఇచ్చారు.