: ప్రజలు సహనంతో ఉండాలి.. కొత్త నోట్లు అందరికీ సరిపడా ఉన్నాయి: ఆర్‌బీఐ


పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంకులకు చేరుకొని గందరగోళానికి గురవుతున్న అంశంపై భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ అధికారులు స్పందించారు. కొత్త నోట్లు అందరికీ సరిపడా ఉన్నాయని, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ప్రజలు సహనంతో ఉండాలని, కొత్త నోట్ల‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చే ప‌నిలోనే తాము ఉన్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు కొన్ని ఏటీఎంలు ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచి తెర‌చుకున్నాయి. ప‌లు ఏటీఎంల‌లో ఉన్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను నిపుణులు ప‌రిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News