: బ్లూ ఫిల్మ్ చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి


కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ తన పార్టీకి తలవంపులు తెచ్చారు. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా రాయచూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో, తన మొబైల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఈ వార్త అన్ని చానళ్లలో రావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అయితే తాను చేసిన ఘనకార్యాన్ని తన్వీర్ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. "తాను ఇల్లు విడిచి మూడు నెలలు అయింది" అంటూ నీతిబాహ్యమైన సమాధానం ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ లు మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతున్న తన్వీర్ ను బీజేపీ నేతలు ఘెరావ్ చేశారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News