: కాబూల్ లోని జర్మనీ కాన్సులేట్ పై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి


తాలిబాన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ నడిబొడ్డులోని జర్మనీ కాన్సులేట్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా, ఇద్దరు మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు తెలిపారు. కారులో బాంబులు నింపుకుని వచ్చిన ఉగ్రవాది రాయబార కార్యాలయం వద్ద తనను తాను పేల్చుకోవడం ద్వారా ఆత్మాహుతి దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. గాయపడిన వారిలో అత్యధికులు స్థానికులేనని సమాచారం. గత వారంలో కుందుజ్ ప్రాంతంలో సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడ్డట్టు తాలిబాన్లు ప్రకటించుకున్నారు. మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News