: పెరుగుతున్న క్యూ లైన్లు - తెరచుకోని ఏటీఎంలు


అన్ని ఏటీఎంలలో కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాకపోవడం, నింపిన వాటిల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కాకపోవడం వంటి కారణాలతో ఉదయం 9 గంటలు అవుతున్నా ఏటీఎం కేంద్రాలు ఇంకా తెరచుకోలేదు. మూడు రోజుల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత, బుధ, గురు వారాల్లో ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ లోగా కొత్త నోట్లు ఏటీఎంలలో ఉంచి, శుక్రవారం ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పొద్దున్నే నిత్యావసరాల నిమిత్తం చిల్లర తీసుకోవాలని ఏటీఎంలకు వెళ్లిన వారిని మూసివున్న తలుపులు 'అవుట్ ఆఫ్ సర్వీస్' అన్న బోర్డులు వెక్కిరిస్తున్నాయి. విషయం తెలీని ప్రజలు ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతూ, ఎప్పుడు తెరుస్తారని అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్నారు. మరికొందరు వాగ్వాదాలకు దిగుతున్నారు. కాగా, మధ్యాహ్నం తరువాత మాత్రమే ఏటీఎంలు తెరచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News