: ప్యాకేజీపై అడగడానికి మోదీని అపాయింట్ మెంట్ అడిగాను...ఇంకా ఇవ్వలేదు: పవన్ కల్యాణ్


'మీరిచ్చే ప్యాకేజీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ అడిగాను. ఆయన ఇంకా ఇవ్వలేదు. ఇస్తే రాష్ట్ర ప్రజల సమస్యలు ఆయనకు వివరించాలని భావిస్తున్నాను' అన్నారు పవన్ కల్యాణ్. 'అనంతపురం జిల్లాను కరవు నుంచి రక్షించడానికి, అలాగే ఈ జిల్లాకి 100 టీఎంసీల నీరు ఎలా ఇవ్వాలో ఆలోచించండి. అనంతపురంను దుర్భిక్షం నుంచి బయటపడేయడానికి పోరాటం ప్రారంభించండి, ఆ పోరాటంలో నేను కూడా కలుస్తాను. దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా పొలిటికల్ కరెప్షన్ అన్నది పోకుండా అసలు అవినీతిని పారద్రోలలేము. అవినీతిరహిత సమాజ నిర్మాణం కోసం జనసేన ఎప్పుడూ పోరాడుతుంది' అని చెప్పారు.

  • Loading...

More Telugu News