: నాలుగు రోజులకు దొరికిన కన్నడ నటుడు అనిల్ మృతదేహం


కన్నడ సినిమా ‘మాస్తిగుడి’ క్లైమాక్స్‌ ను బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి జలాశయంలో చిత్రీకరిస్తుండగా, నటులు ఉదయ్‌, అనిల్‌ హెలికాప్టర్ నుంచి దూకి ఈతరాక, సరైన సమయంలో సహాయం అందక నీటమునిగి గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ ఇద్దరు నటుల మృతదేహాల గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే ఉదయ్ మృతదేహం లభ్యం కాగా, నాలుగు రోజుల తరువాత అనిల్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనిల్ మృతదేహానికి జలాశయం వద్దే శవపరీక్ష నిర్వహించి, అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నటుల మృతదేహాల గాలింపులో జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు, గజ ఈతగాళ్లు మొత్తం 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనపై నిర్మాత, దర్శకుడు, స్టంట్ మాస్టర్, యూనిట్ పై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News