: పెద్దనోట్ల రద్దును తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి: ములాయం సింగ్ డిమాండ్


నోట్ల రద్దును తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ సూచించారు. లక్నోలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను జైలుకు పంపకుండా ఎమర్జెన్సీ విధించడమంటే ఇదేనంటూ మోదీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోనివ్వాలన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకుండా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. పేదలను, మధ్య తరగతి ప్రజలను హింసించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, నోట్ల రద్దును తాత్కాలికంగా వాయిదా వేయాలని, ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ములాయం సింగ్ డిమాండ్ చేశారు. కాగా, పెద్ద నోట్ల రద్దుపై బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి కూడా పెదవి విరిచారు. నోట్ల రద్దు కారణంగా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News