: మోదీ జపాన్ పర్యటనపై స్పందించిన చైనా
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనపై డ్రాగన్ కంట్రీ చైనాకు గుబులు పట్టుకుంది. భారత్, జపాన్ లు తమ న్యాయసమ్మతమైన అంశాలను గౌరవిస్తాయని భావిస్తున్నట్టు చైనా పేర్కొంది. ఇరు దేశాలు సాధారణ సంబంధాలను పెంపొందించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సంబంధాలు పెట్టుకునే క్రమంలో, పొరుగు దేశానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించింది. భారత్, చైనాలు అలాగే చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చైనా గౌరవించాలని ఇటీవల భారత్, జపాన్ లు కోరిన విషయం తెలిసిందే. అంతేకాదు, భారత్ ఇదే తీరును కొనసాగిస్తే ద్వైపాక్షిక వ్యాపార సంబంధాల్ని కోల్పోవాల్సి వస్తుందని చైనా మీడియా ఇప్పటికే హెచ్చరించింది.