: ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై గ్రెనేడ్ విసిరిన దుండగులు
గ్రీస్ దేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దుండగులు గ్రెనేడ్ విసిరారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఎథెన్స్ లోని గ్రీస్ పార్లమెంట్ కు సమీపంలో ఉన్న ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో బైక్ పై వచ్చిన దుండగులు గ్రెనేడ్ విసిరి పారిపోయారన్నారు. ఈ సంఘటనలో ఒక పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ సంఘటనపై తమ దేశానికి చెందిన యాంటీ టెర్రరిజం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.