: ట్రంప్ ఎఫెక్ట్... సందిగ్ధంలో ప్యారిస్ ఒప్పందం


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం... ప్యారిస్ ఒప్పందంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్యారిస్ ఒప్పందం వల్ల అమెరికాకు తీవ్ర నష్టమని... తాను అధ్యక్షుడినైతే ఆ ఒప్పందానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో, కాలుష్య స్థాయులను గణనీయంగా తగ్గిస్తామంటూ ఒబామా ఇచ్చిన హామీని ట్రంప్ తుంగలో తొక్కేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం మొరాకోలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు జరుగుతోంది. ట్రంప్ గెలిచారన్న వార్త అక్కడ ప్రకంపనలు పుట్టించింది. ట్రంప్ గెలుపుతో పర్యావరణవేత్తలు షాక్ అయ్యారు. పర్యావరణ సంస్థ 350.org మరో అడుగు వేసి కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ ప్రణాళికకు ట్రంప్ బ్రేక్ వేస్తారని... దీనికి మనం విరుగుడు కనుగొనాలి అని ఆ సంస్థ ప్రతినిధి బోఈవ్ అన్నారు.

  • Loading...

More Telugu News