: టుడేస్ హాట్ ట్రెండ్... చేతిలో రూ. 2 వేలతో ఓ సెల్ఫీ!


పొద్దున లేచింది మొదలు, రాత్రి పడుకునేంత వరకూ ఏం చేస్తున్నామో సెల్ఫీల రూపంలో స్నేహితులతో పంచుకునే స్మార్ట్ ఫోన్ యూజర్లు, నేడు రూ. 2 వేల కొత్త నోట్లపై పడ్డారు. చేతిలో ఓ రెండు వేల రూపాయల నోట్ పట్టుకుని సెల్ఫీ దిగి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారి సంఖ్య నిమిష నిమిషానికీ పెరిగిపోతోంది. ఎవరి చేతికి కరెన్సీ నోటు వచ్చినా, దాన్ని మురిపెంగా చూసుకుంటూ, ఓ సెల్ఫీ దిగడం నేటి హాట్ ట్రెండ్ గా మారింది. సోషల్ మీడియా అంతా రెండు వేల నోట్లే కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సైట్లలో కొత్త నోట్లు చేతికందాయన్న ఆనందాన్ని పంచుకుంటున్న వారి సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుతోంది.

  • Loading...

More Telugu News