: జపాన్ పర్యటన మార్గమధ్యంలో బ్యాంకాక్‌లో దిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి జపాన్ పర్యటనకు బయలుదేరారు. అయితే, జపాన్ పర్యటన మార్గమధ్యంలో మోదీ బ్యాంకాక్‌లో దిగారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఇటీవల కన్నుమూసిన థాయ్‌లాండ్ రాజు భూమిబల్ అదుల్యాడెజ్ (88)కి నివాళులు అర్పించడానికి ఆయన అక్కడ దిగినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి ఆయన ఈ రోజు సాయంత్రం తిరిగి జపాన్ కు బయలుదేరనున్నారు.