: మహబూబ్‌నగర్‌లో విషాదం.... మహిళ ప్రాణం తీసిన పెద్దనోట్ల రద్దు
మహబూబ్‌నగర్‌లోని శనిగపురంలో ఈ రోజు విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నల్లధనం నిరోధానికి తీసుకొన్న నిర్ణయంతో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లు చలామణీలో లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడం, డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అవగాహనా లోపంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో దాచుకున్న డబ్బు ఇక చెల్లదనే మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల సదరు మహిళ తనకున్న భూమిని విక్రయించినట్లు, ఇప్పుడు ఆ డబ్బు చెల్లదని భావించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.