: టీసీఎస్ కు కొత్త చైర్మన్... సైరస్ మిస్త్రీ స్థానంలో ఇషాత్ హుస్సేన్
సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ గా తొలగించిన తరువాత, ఆ పదవికి ఇంకో వ్యక్తిని నియమించేందుకు నాలుగు నెలల స్వీయ గడువు విధించుకున్న సంస్థ, తన అనుబంధ కంపెనీల్లో మాత్రం సైరస్ స్థానంలో కొత్త వ్యక్తులను నియమిస్తోంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ నూతన చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ ను నియమిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇషాత్ వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేసింది. ఇషాత్ నాయకత్వంలో సంస్థ మరింత ఉన్నతికి వెళుతుందని తాను నమ్ముతున్నట్టు ఈ సందర్భంగా రతన్ టాటా వ్యాఖ్యానించారు.