: మధ్యాహ్నం తర్వాతే నగదు మార్పిడి.. బ్యాంకులు తెరవగానే కుదరదంటున్న అధికారులు


బ్యాంకుల కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నట్టుగా ప్రజలు గతంలో ఎప్పుడూ చూసి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. గురువారం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు పది గంటలవుతుందా? అని ప్రజలు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. అనుకున్న రోజు వచ్చేసింది. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులు చెబుతున్న మాటలతో వారిలో నిరుత్సాహం ఏర్పడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో జేబులో చిల్లిగవ్వ లేక బ్యాంకుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకులు తెరవగానే నగదు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం బ్యాంకులు తెరిచిన వెంటనే నగదు మార్పిడి చేయలేమని చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత మార్పిడి చేస్తామని అంటున్నారు. బ్యాంకులకు ఇంకా పూర్తిస్థాయిలో నగదు చేరుకోకపోవడమే కారణమని చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాతే బ్యాంకులకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాయంత్రానికి గానీ నగదు మార్పిడి జరిగే అవకాశం కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News