: నల్లధనాన్ని ప్రజలకు పంపిణీ చేసి, హీరోగా మారిన రాజకీయనాయకుడు


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులపై ప్రభావం చూపుతోంది. తాజాగా కర్ణాటకలోని కోలార్ లో ఓ ఎమ్మెల్యే తనవద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీశాడు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో హీరోగా మారాడు. ఆయన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, మూడు లక్షల రూపాయల చొప్పున డబ్బును కట్టలుగా కట్టి, ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News