: రాబోయే రోజుల్లో రూ.200 నోటు వస్తుంది: సీఎం చంద్రబాబు


రాబోయే రోజుల్లో రూ.200 నోటు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్థిక నేరాలు తగ్గుతాయని, ఆన్ లైన్ వ్యవహారాలు పెరుగుతాయని, బ్యాంకులు మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. రెండు వేల నోట్లను పరిమితంగా విడుదల చేస్తారని, అసలు, రెండు వేల నోట్లు అవసరమా? అనే విషయమై మరోసారి చర్చించాల్సిన అవశ్యకత ఉందన్నారు. పెద్ద నోట్లు రద్దయ్యాక రెండు వేల నోట్లు అనవసరమన్నారు. పెద్దనోట్లు రద్దు కారణంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు ఉంటాయని, పెద్దనోట్ల రద్దుపై మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News