: భయం వద్దు...శని, ఆదివారాలు బ్యాంకులు పని చేస్తాయి: కేంద్రం


500, 1000 రూపాయల నోట్ల రద్దుతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు, రేపు బ్యాంకింగ్ సేవలు నిలిపివేసిన సందర్భంగా, శని, ఆది, సోమవారాలు పని చేస్తాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ శని, ఆదివారాలు కూడా బ్యాంకుల సేవలందించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యావసరాలకు సరిపడా మొత్తాన్ని వినియోగదారులకు అందజేసేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News