: వెక్కి వెక్కి ఏడ్చిన హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని ఎన్నో స‌ర్వేలు చెప్ప‌డంతో ఆమె గెలుపుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆమె మ‌ద్ద‌తుదారులు ఈ రోజు వెక్కివెక్కి ఏడ్చేశారు. ఈ రోజు ఎన్నిక‌ల కౌంటింగ్‌లో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించాడ‌ని తెలియ‌గానే ఆ ఓటమిని భ‌రించ‌లేక మన్‌హట్టన్‌లోని జేకబ్‌ కె.జవిట్స్‌ సెంటర్‌లో హిల్లరీ మద్దతుదారులు విల‌పించారు. ఆ ప్రాంతంలో హిల్ల‌రీ మ‌ద్ద‌తుదారులు ఒక‌రిపై ఒక‌రు ప‌డి ఏడ‌వ‌డం, ఏడుస్తున్న‌ వారిని వారిలో వారే ఓదార్చుకోవ‌డం క‌నిపించాయి. మరోవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు పండుగ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News