: బ్యాంకులకు అగ్నిపరీక్ష...లాభం కంటే నష్టమే ఎక్కువ: చిదంబరం


500, 1000 రూపాయల నోట్ల రద్దుపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు. ప్రజలను పూర్తి సన్నద్ధులను చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన తెలిపారు. అకస్మాత్తుగా 1978లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకున్న కరెన్సీ రద్దు ప్రయోగం అందుకే విఫలమైందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలను ముందుగా సన్నద్ధులను చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం, బ్యాంకులకు అగ్నీ పరీక్షా సమయమని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని ఆయన తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News