: మోదీగారూ! ఏం చేస్తున్నారో అర్ధమవుతోందా?: అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో ఆయనకు అర్ధమవుతోందా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ఓ సభలో ఆయన మాట్లాడుతూ, "నేను తినను, తిననివ్వను అని చెబుతున్న మోదీగారూ! విజయ్ మాల్యా, లలిత్ మోదీలు వేల కోట్ల రూపాయలతో విదేశాలకు పారిపోతే మీరు ఏం చేశారు?" అని ప్రశ్నించారు. అకస్మాత్తుగా కరెన్సీకి విలువ లేదని ప్రకటించడం వెనుక ప్రజల కష్టాల గురించి ఆలోచించారా? అని అడిగారు. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయాలు ప్రకటిస్తే ప్రజలకు ఎంత కష్టంగా ఉంటుందో గుర్తించాలని, అందుకు తగ్గ చర్యలు తీసుకున్న తరువాత ఇలాంటి నిర్ణయాలను ప్రకటించి ఉంటే బాగుంటుందని ఆయన చెప్పారు. నల్లధనం అరికట్టేందుకు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నప్పుడు, మళ్లీ 500, 2000 రూపాయలు నోట్లు విడుదల చేయడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అంటే మళ్లీ అవినీతి చేసుకొమ్మనా? అని ఆయన అడిగారు.