: గగన ప్రయాణం మరింత ఖరీదు
విమాన ప్రయాణికులకు సేవలు మరింత ప్రియం కానున్నాయి. నచ్చిన సీటు కోరుకుంటే ఇప్పటిలా కాకుండా అదనంగా మరికొంత పైకం చెల్లించాల్సిందే. బ్యాగేజీ చెకింగ్ కు కూడా చార్జి ఉంటుంది. వెంట క్రీడా, సంగీత పరికరాలు తీసుకెళుతుంటే వాటికి కొంత రుసుము కట్టాలి. అధిక విలువగల లగేజీ ఉన్నా అంతే. ఇప్పటి వరకూ 20 కేజీల లగేజీ ఉచితంగా తీసుకెళ్లడానికి దేశీయ విమాన ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీనిని 15 కేజీలకు తగ్గించే యోచనలో విమానయాన కంపెనీలున్నాయి. ఇలా సేవలపై అదనంగా చార్జీలు వడ్డించడానికి విమానయాన సేవల సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.