: ఏకంగా రూ. 1400 పెరిగిన బంగారం ధర. రూ. 45 వేలకు కిలో వెండి


అగ్రరాజ్యానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారని వస్తున్న వార్తలు బులియన్ మార్కెట్ పై పెను ప్రభావాన్ని చూపించాయి. ఈ ఉదయం బులియన్ సెషన్లో బంగారం ధర హైజంప్ చేసింది. ఉదయం 10:50 గంటల ప్రాంతంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,405 పెరిగి రూ. 31,285 (డిసెంబర్ 5 డెలివరీ)కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 4.70 శాతం అధికం. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,412 పెరిగి రూ. 44,721కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 3.26 శాతం అధికం.

  • Loading...

More Telugu News