: టోల్ గేట్ల వద్ద నోట్ల సంక్షోభం... భారీగా నిలిచిన ట్రాఫిక్
గత అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదార్లపై ఉన్న టోల్ గేట్ల వద్ద నోట్ల సంక్షోభం నెలకొంది. టోల్ గేట్ సిబ్బంది 500, 1000 నోట్లను తీసుకోవడం లేదు. వాహనదారుల వద్ద వంద రూపాయల నోట్లు లేకపోవడంతో... అక్కడ భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. సరైన చిల్లర ఇవ్వాలంటూ టోల్ సిబ్బంది వాహనదారులను కోరుతున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి, వాహనదారులకు తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. పెట్రోల్ బంకుల్లో సైతం ఇదే తరహా పరిస్థితి ఉంది.