: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు లాభపడి 27591 వద్ద, నిఫ్టీ 46.50 పాయింట్లు లాభపడి 8543.55 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో టెక్ మహీంద్రా, గెయిల్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, టాటా మోటార్స్ (డి) సంస్థల షేర్లు లాభపడగా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, సిప్లా, టాటా పవర్ సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి.