: ‘లెనోవో ఫ్యాబ్-2 ప్లస్’.. 4050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి కొత్త ఫోను
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ లెనోవో నుంచి 4050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మరో కొత్త ఫోను మార్కెట్లోకి వచ్చింది. ఫ్యాబ్-2 ప్లస్ పేరుతో విడుదలైన ఈ మోడల్ ఫోనును అమెజాన్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఫ్యాబ్-2 ప్లస్ రూ.14,999గా ఉంది. ఇందులో 6.4 ఇంచెస్ టచ్ స్కీన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మొమొరీ 13 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సదుపాయం ఫీచర్లుగా ఉన్నాయి.