: ఫ్లిప్ కార్ట్ లో ట్యాబ్ ఆర్డర్ చేస్తే... ఏం వచ్చాయో చూడండి
ఈకామర్స్ సంస్థల ద్వారా తక్కువ ధరకే తమకు కావాల్సిన వాటిని సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు అడపాదడపా చేదు అనుభవాలు మిగులుతున్నాయి. తాజాగా, హైదరాబాదులో ఓ వ్యక్తికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్10లోని కేర్ ఓపీలో పనిచేస్తున్న సందీప్ ఐదు రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ లో లెజెండ్ ట్యాబ్ ను ఆర్డర్ చేశాడు. అంతేకాదు, రూ. 6 వేలు ముందుగానే ఆన్ లైన్లో చెల్లించాడు. నిన్న అతనికి పార్సిల్ అందింది. పార్సిల్ ఓపెన్ చేసిన సందీప్ కు షాక్ తగిలింది. పార్శిల్ లో ట్యాబ్ ఉంటుందనుకుంటే... రాళ్లు, సాక్సులు వచ్చాయి. దీంతో, అతను బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.