: ఇలాగైతే, రేపటి భారత్ - ఇంగ్లండ్ మ్యాచ్ రద్దే... సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన బీసీసీఐ


లోథా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు నిధులను విడుదల చేసే విషయంలో తమకు వెసులుబాటు లేనందున రేపటి నుంచి జరగాల్సిన భారత్ - ఇంగ్లండ్ మ్యాచ్ ను రద్దు చేయక తప్పేట్టు లేదని బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) స్పష్టం చేసింది. తాము డబ్బులు పంపించకుంటే, మ్యాచ్ నిర్వహణ క్లిష్టతరం అవుతుందని, ఈ పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు మినహా మరో మార్గం లేదని సుప్రీంకోర్టుకు ఈ ఉదయం బీసీసీఐ అఫిడవిట్ ను సమర్పించింది. నిధులు విడుదల చేసేందుకు అంగీకరించాలని కోరింది. ప్రస్తుతం కోర్టు బీసీసీఐ అఫిడవిట్ ను పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News