: ‘కాల్పుల మోత’.. నౌషెరా సెక్టార్ వద్ద ఉదయం నుంచి కొనసాగుతున్న పాక్ బలగాల కాల్పులు
పాకిస్థాన్ బలగాలు ఈ రోజు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. తరచూ కాల్పులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి జమ్ముకశ్మీర్ రాజౌరిలోని నౌషెరా సెక్టార్ వద్ద పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. కాల్పులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. కొన్ని రోజులుగా కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. పాకిస్థాన్ రేంజర్ల కాల్పులకు భారత జవాన్లు గట్టిగా బుద్ధి చెబుతున్నప్పటికీ పాక్ మాత్రం తన తీరుని మార్చుకోకుండా అమాయక పౌరులతో పాటు జవాన్లపై కాల్పులకు దిగుతోంది.