: ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాజమౌళి.. ధీమాగా చెప్పిన వర్మ!
340 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ‘న్యూక్లియర్’ పేరిట అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ‘ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ) బ్యాక్ విత్ బ్యాంగ్..? నిజంగా!’ అని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన వర్మ ‘సర్.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్ లో మాట్లాడుతూ బీబీ (బాహుబలి) నుంచి పొందిన స్ఫూర్తి గురించి ప్రామిస్ చేశాను. ష్యూర్ గా ఈ 'బ్యాంగ్'ను బ్లాస్ట్ చేస్తాను’ అంటూ ఆ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు.