: అసాంజే విచారణకు అనుమతిచ్చిన ఈక్వెడార్ ఎంబసీ
లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్న వికీలీక్స్ అధినేత జూలియస్ అసాంజేను విచారించేందుకు ఈక్వెడార్ ఎంబసీ అనుమతించింది. 2010లో ఆయన స్వీడన్ లో ఒక మహిళను రేప్ చేశాడంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు స్వీడన్ న్యాయవాదులకు ఈక్వెడార్ అనుమతినిచ్చింది. దీంతో ఈక్వెడార్ న్యాయవాదుల సమక్షంలో ఈ నెల 14న ఆయన విచారణ ఈక్వెడార్ ఎంబసీలో జరగనుంది. విచారణ అనంతరం ఆయన అనుమతితో ఈయన డీఎన్ఏను అధికారులు సేకరించనున్నారు. కాగా, ఈక్వెడార్ లోని ప్రతిపక్ష ఆరోపణలకు తలొగ్గిన ప్రభుత్వం ఆయన విచారణకు అనుమతించింది. కాగా, రేప్ ఆరోపణలను అసాంజే ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని ఆయన స్పష్టం చేశారు. కాగా, అసాంజే గత నాలుగేళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.