: ఏడు దేశాల్లోని భారత ఎంబసీల డేటా హ్యాకింగ్?


ఏడు దేశాల్లోని భారత ఎంబసీలకు చెందిన వెబ్ సైట్ లు హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించినట్టు ‘ఈహ్యాకింగ్ న్యూస్. కామ్’ అనే సంస్థ పేర్కొన్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం. దక్షిణాఫ్రికా, లిబియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మలావి, మాలి, రొమేనియా దేశాల్లోని మన దేశ ఎంబసీ కార్యాలయాలకు చెందిన వెబ్ సైట్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. అయితే, ఆయా సైట్లు ప్రస్తుతం పనిచేస్తూనే ఉన్నాయని కూడా ఆ కథనంలో పేర్కొంది. లీకైన డేటాలో అడ్మిన్, లాగిన్ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పేర్లు, పాస్ పోర్టు నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను పోస్ట్ చేసిన ‘పేస్ట్ బిన్.కామ్’ అనే వెబ్ సైట్ లో పేజీని భారత ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దక్షిణాఫ్రికాలో 161, స్విట్జర్లాండ్ లో 35, ఇటలీలో 145, లిబియాలో 305, మలావిలో 14, మాలి, రొమేనియాల్లో నివసించే 42 మంది భారతజాతీయుల వివరాలను హ్యాకర్లు లీక్ చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నట్లు ఆంగ్లపత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News