: ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1000 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల రేపే!
ఆంధప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు తీపి కబురును అందించడానికి సిద్ధమవుతోంది. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 1000 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్కారు అభ్యర్థుల వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.