: బీచ్ ఫెస్టివల్ కు అనుమతిచ్చామని కొందరు అసత్యప్రచారం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు


విశాఖ తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ కొందరు అసత్యప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. భారతదేశ సంప్రదాయానికి తానెప్పుడూ తిలోదకాలు ఇవ్వనని, ప్రపంచంలోనే బెస్ట్ కల్చర్ ఉండే ఏకైక దేశం భారతదేశమని తాను నమ్ముతానని అన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బీచ్ ను అభివృద్ధి చేయడానికి మాత్రమే ముందుకు వచ్చారని అన్నారు. అయితే, బీచ్ లో బికినీ ఫెస్టివల్ నిర్వహిస్తారంటూ ఒక అసత్యాన్ని కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు, అక్కడ ఏమీ లేకుండానే ఒక ఇష్యూ చేసి, దాని మీద రాజకీయాలు చేయాలనుకోవడం చాలా దారుణమైన విషయమని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News