: యువరాజ్‌ పెళ్లిలో అద్భుతంగా డాన్స్‌ చేస్తా: హర్భజన్ సింగ్


టీమిండియా ఆట‌గాడు యువరాజ్ సింగ్ వ‌చ్చేనెల‌లో నటి హచల్‌ కీచ్‌ను వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. దీంతో యువీ బెస్ట్ ఫ్రెండ్ హర్భజన్‌ సింగ్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాడు. త‌న మిత్రుడి పెళ్లి వేడుక‌లో డాన్స్ చేస్తాన‌ని హ‌ర్భ‌జ‌న్ సామాజిక మాధ్య‌మంలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తాను పెళ్లిలో ఎలా డాన్స్ చేయాలనుకుంటున్నాడో కూడా చెప్పాడు. చిన్న పిల్లలు మాస్ స్టెప్పులు వేస్తూ ఉన్న వీడియోను పోస్టు చేస్తూ, అలా తాను స్టెప్‌లు వేస్తాన‌ని పేర్కొన్నాడు. గ‌త ఏడాది హర్భజన్ వివాహ విందుకు యువ‌రాజ్ సింగ్‌ ఆంధ్రప్రదేశ్ జట్టుతో పంజాబ్‌ తరఫున ఆడాల్సిన‌ రంజీ మ్యాచ్‌ను వ‌దులుకొని మరీ వెళ్లాడు. ఇప్పుడు యువరాజ్ వివాహవేడుకలో్ హర్భజన్ సందడి చేయనున్నాడు.

  • Loading...

More Telugu News