: కేంద్ర మాజీ మంత్రి జయవంతిబెన్‌ కన్నుమూత


అనారోగ్య కారణంగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు జయవంతి బెన్‌ మెహతా(78) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ శ్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం జ‌య‌వంతి బెన్ మెహ‌తా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. మధ్యతరగతి గృహిణి అయిన ఆమె బీజేపీలో చేరి మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయీ హ‌యాంలో కేంద్రమంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆమె ‘మార్చింగ్‌ విత్‌ టైమ్‌’ పేరుతో ఆత్మకథను రాశారు. ఆమె మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ప‌లువురు రాజ‌కీయ నేత‌లు సంతాపం వ్యక్తం చేశారు. జ‌య‌వంతి బెన్ మెహ‌తా దేశానికి చేసిన సేవ‌లు మ‌రిచిపోలేనివ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News