: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో 160 పూరిళ్లు దగ్ధం.. భారీగా ఆస్తినష్టం
రాజమండ్రి కొంతమూరులోని కల్యాణనగర్‌లో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సుమారు 160 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం ధాటికి ఆస్తినష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సాయం చేస్తూ మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.