: 'న్యూక్లియర్' గురించి మరిన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్న వర్మ


ఓ గంట క్రితం రూ. 340 కోట్లతో 'న్యూక్లియర్' పేరిట అంతర్జాతీయ చిత్రం తీస్తున్నట్టు చెబుతూ, దాని స్టోరీ లైన్ ను సైతం తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, ఆ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు పంచుకున్నాడు. ముంబైలో అణుబాంబు పేలగా, అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో కకావికలై పరుగులు పెడుతున్న ప్రజలను చూపుతూ ఓ పోస్టర్ ఉంచాడు. ఈ చిత్రాన్ని అమెరికా, చైనా, రష్యా, యమన్, ఇండియాలో చిత్రీకరిస్తానని, అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ నటులు నటిస్తారని చెప్పుకొచ్చాడు. తనతో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించిన సీఎంఏ గ్లోబల్ దీన్ని నిర్మిస్తుందని అన్నాడు. తన తాజా చిత్రం 'సర్కార్ 3' షూటింగ్ ముగిసిన తరువాత 'న్యూక్లియర్' మొదలవుతుందని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News