: జవాన్లకు మరింత భద్రత... 27,500 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు


సరిహద్దులో నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టి, దేశ రక్షణకోసం పాటుపడుతున్న వీర సైనికులకు మరింత భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. పాక్ రేంజర్లు, ఉగ్రవాదుల దాడుల్లో కొన్ని సందర్భాల్లో మన జవాన్లు ప్రాణాలను కోల్పోతున్న నేపథ్యంలో, మొత్తం 27,500 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనుంది. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత బలగాలు మట్టుబెట్టిన తర్వాత... భారత జవాన్లే లక్ష్యంగా పాక్ రేంజర్లు అనునిత్యం కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు, గడచిన రెండు, మూడు ఏళ్లలో ఉగ్రవాదుల దాడుల్లో 150 మంది పోలీస్ ఉన్నతాధికారులు, జవాన్లు అమరులయ్యారు. వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలో, జవాన్ల ప్రాణాలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనుంది. ఇప్పటికే ఫ్రాన్స్, యూకే, అమెరికా వంటి దేశాలు తమ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చాయి.

  • Loading...

More Telugu News