: అమెరికాలో మిలియన్ డాలర్ల ప్రశ్న... హిల్లరీ గెలిస్తే బిల్ క్లింటన్ ను ఏమని పిలవాలి?


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తూ, హిల్లరీ క్లింటన్ పీఠమెక్కితే, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఏమని పిలవాలి? అమెరికాలో నలుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే. ఇంతకుముందెన్నడూ ఓ మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించలేదు కాబట్టి, ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించాల్సిన అవసరమూ లేకపోయింది. ఇప్పుడు, హిల్లరీ గెలిస్తే, బిల్ ను ఏమనాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. హిల్లరీ విజయంతో బిల్ అమెరికాకు తొలి పురుష అధ్యక్ష జీవిత భాగస్వామి అవుతారు. అంతేకాదు, వైట్ హౌస్ లో తిరిగి కాలు పెడుతున్న తొలి మాజీ అధ్యక్షుడిగానూ చరిత్ర సృష్టిస్తారు. ఇక బిల్ ను 'మిస్టర్ ప్రెసిడెంట్' అనవచ్చని, 'ఫస్ట్ జంటిల్ మెన్' అనాలని ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు. ఇక హిల్లరీ గెలిస్తే, తాము మాత్రం ప్రొటోకాల్ ప్రకారం నడుచుకుంటామని, అధికార కార్యక్రమాల్లో బిల్ ను మాజీ అధ్యక్షుడిగానే సంబోధిస్తామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News