: 'రాహుల్ కు పట్టం' మరో ఏడాది వాయిదా!
ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రక్రియ మరో ఏడాది పాటు ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏడాది కాలం వాయిదా వేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై నేడు జరిగే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం అనంతరం అధికార ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికలను ఒకసారి వాయిదా వేసిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే సంవత్సరం యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు వాయిదా కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నట్టు పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.