: వైద్యుల సూచనలతో ఢిల్లీలో మాస్కులకు పెరిగిన గిరాకీ.. ఊపందుకున్న అమ్మకాలు


ఎన్నడూ లేనంతగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడంతో మాస్కుల అమ్మకాలు ఊపందుకున్నాయి. మాస్కులు లేకుండా బయటకు వచ్చే సాహసం చేయవద్దంటూ వైద్యులు సూచించడంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని చోట్ల స్టాక్ నిండుకుందంటే వాటి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఢిల్లీలో వాయుకాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో మాస్కుల అమ్మకాలు ఈ ఏడాది పదిరెట్లు పెరిగాయి. పలు కంపెనీలు, కార్యాలయాలు తమ సిబ్బంది కోసం మాస్కులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడంతో మధ్యాహ్నానికే స్టాక్ నిండుకుందని మాస్కులు విక్రయించే సైదీర్ గుప్తా తెలిపారు. మాస్కులకు డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో వాటికి ఆర్డర్ పెట్టినట్టు మరో వ్యాపారి సుదేశ్ మెహతా పేర్కొన్నారు. మాస్కులు బయట దొరకడం గగనంగా మారడంతో కొందరు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఆన్‌లైన్‌లోనూ వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో మాస్క్ ధరించని మనిషి కనిపించడం లేదనడం అతిశయోక్తి కాదేమో!

  • Loading...

More Telugu News